- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాల్సిందే.. మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
బండి భగీరథ్ అరెస్టు, లొంగిపోవడంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagiratha) కేసుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ‘నా బూత్-నా భవిష్యత్తు’ పేరుతో బీఎల్‌ఏలకు బీఆర్ఎస్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ.. బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా లేక ఆయనే లొంగిపోయాడా? అనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సీఎం, కేంద్రమంత్రి కలిసి డ్రామాలు ఆడుతున్నారని, కేసును నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ‘భేటీ బచావ్-భేటీ పడావ్’ అంటాడు.. కానీ పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకు మీద లుక్‌అవుట్ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు.
గీరథ్‌పై పోక్సో కేసు బుక్ అయ్యాక.. 9 రోజులు అతడిని దాచిపెట్టింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి.. చట్టాన్ని గౌరవించకుండా, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన బండి సంజయ్‌ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి ఇద్దరూ కలిసి ఈ కేసును పక్కదారి పట్టించేందుకు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓ బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని కామెంట్ చేశారు. సామాన్యులకు ఓ న్యాయం, అధికారంలో ఉన్నవారికి ఓ న్యాయమా.. అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసు విషయంలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటం చేస్తామని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.






