- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరా తీశారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరా తీశారు. కేసీఆర్‌కు అత్యున్నత, మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకుని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే కేసీఆర్ తీవ్రజ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సీజనల్ జ్వరం రాగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. స్వయంగా యశోద ఆస్పత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సీఎం ఆదేశాలతో కొంతమంది అధికారులు కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Next Story






