- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాన్వాయ్‌ను పక్కనబెట్టి మెట్రో రైలు ఎక్కిన బండి సంజయ్.. కారణం ఇదే!
by Gantepaka Srikanth |
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైల్(Delhi Metro train)లో ప్రయాణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైల్(Delhi Metro train)లో ప్రయాణించారు. వాస్తవానికి గురువారం సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లోని తన నివాసం నుండి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్‌ను పక్కనపెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైల్ ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
Next Story






