సీఎస్ , రాష్ట్ర పోలీస్ శాఖతో కేంద్ర హోం శాఖ సెక్రటరీ భేటీ

by Ajay Maddhiboyina |

కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ రాష్ట్ర సీఎస్ , పోలీస్ శాఖతో 8వ తేదిన భేటి కానున్నారు. ఈ సమావేశానికి సబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

సీఎస్ , రాష్ట్ర పోలీస్ శాఖతో కేంద్ర హోం శాఖ సెక్రటరీ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ రాష్ట్ర సీఎస్ , పోలీస్ శాఖతో 8వ తేదిన భేటి కానున్నారు. ఈ సమావేశానికి సబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ప్రజా భవన్ లో రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్ర డీజీపీ, ఏడీజీపీ సీఐడి, ఫోరెన్సెక్, సైబర్ క్రైమ్ , నార్కోటిక్స్, డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ ఫైర్, జైళ్ళశాఖ అధికారులతో చర్చించనున్నారు. సీఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోం శాఖ, రెవెన్యూ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ పై రాష్ట్ర స్థాయి అధికారులతో శనివారం మధ్యాహ్నం సీఎస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.

Next Story