- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలంగాణకు రెండు కేబినెట్ బెర్తులు?
మోదీ కేబినెట్ విస్తరణ వేళ తెలంగాణ కమలనాథుల్లో టెన్షన్ నెలకొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరగనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించేందుకు కాషాయ ఎంపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కులాలు, ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆశావహులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే, పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రానికి ఒకటా.. రెండా?
రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా, ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయమంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతున్నది. రెండు పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుందని టాక్ ఉంది. ఆ రెండు పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతున్నది. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం వరించే చాన్స్ ఉంటుదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎవరి లెక్క వారిదే..
ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకునేందుకు నలుగురు ఎంపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ కుమార్, గోడం నగేశ్ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్‌కు పదవి వస్తుందనే ధీమాలో ఆయన సన్నిహితులు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్‌కు చివరి నిమిషంలో మిస్ అయ్యింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు గుర్తుచేస్తున్నారు. అలాగే, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తరువాత ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లోనే చెప్పిన విషయాన్ని డీకే అరుణ సన్నిహిత నేతలు వివరిస్తున్నారు. అలాగే, మహిళా కోటాలోనూ ఆమె పేరును తప్పక పరిశీలిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేశ్ (అదిలాబాద్)ఉన్నారు. ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుదని ధీమాతో ఆయన ఉన్నారు. అలాగే, బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా కేంద్రమంత్రి వర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కిషన్ రెడ్డికి మరింత ప్రయారిటీ..
రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి వర్గంలో కేబినెట్ హోదాలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరింత ప్రయారిటీ ఉంటుందని చర్చ జరుగుతున్నది. ఈసారి మంత్రల శాఖలను మార్చే అవకాశం ఉందని వార్తలు బలంగా వస్తున్నాయి. దీనితో కిషన్ రెడ్డికి మరింత ప్రాధాన్యత ఉన్న శాఖ ఇచ్చే అవకాశం ఉందని టాక్ ఉంది. దక్షిణ భారతంలో పార్టీ విస్తరణ కోసం ఆయనను కేబినెట్ నుంచి తప్పించి, పార్టీలో కీలకమైన హోదా కల్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్నది. ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రెటరీ పదవిని కట్టబెట్టి, దక్షిణాది రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగించే కోణంలో ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు కమలం నేతల మధ్య డిస్కషన్ జరుగుతున్నది.






