- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
72 డాలర్ల వద్దకు చేరిన బ్రెంట్ క్రూడ్.. దేశంలో స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 72 డాలర్లకు పడిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఫలప్రదం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి అంటే బ్యారెల్‌కు 72.48 డాలర్ల వద్దకు పడిపోయింది. అయినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ (OMCs)లు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో దేశంలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.7.5 నుంచి రూ.8 వరకు భారం పడింది. అయితే, వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చలు సఫలం కావడంతో చమురు సరఫరాపై ఆందోళనలు తొలిగి, క్రూడ్ ధరలు దిగివచ్చాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.73 ఉండగా.. డీజిల్ రూ.103.82గా ఉంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20, ముంబైలో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.83, బెంగళూరులో పెట్రోల్ రూ.110.89, డీజిల్ రూ.98.80, చెన్నైలో పెట్రోల్ రూ.108.01, డీజిల్ రూ.99.66, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ.113.51, డీజిల్ ధర రూ.99.82గా ఉంది.






