- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మలమ్మ రిజర్వాయర్ లో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం
జమ్మలమ్మ రిజర్వాయర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

X
జమ్మలమ్మ రిజర్వాయర్ లో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం
దిశ, గద్వాల రూరల్ : జమ్మలమ్మ రిజర్వాయర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం మేరకు.. 10వ బెటాలియన్ రిజర్వు ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందికి శిక్షణలో భాగంగా జమ్మలమ్మ రిజర్వాయర్లో బోటింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. బోటింగ్ ప్రాక్టీస్ సమయంలో వారు ఒక గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గుర్తించారు. అయితే విషయాన్ని 10వ బెటాలియన్ కమాండెంట్ జయరాజు ఎస్పీ శ్రీనివాసరావుకి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల గ్రామీణ ఎస్ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని ఎస్ డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Next Story






