కాళేశ్వరం ఇంజనీర్లకు ఊహించని షాక్.. నిషేధిత జాబితాలోకి ఆ ముగ్గురి ఆస్తులు

by Kema Shiva Kumar |

కాళేశ్వరం లిఫ్ట్ ఇగిరేషన్ (Kaleshwaram Lift Irrigation) నిర్మాణంలో భాగస్వాములైన ప్రభుత్వ ఇంజినీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది.

కాళేశ్వరం ఇంజనీర్లకు ఊహించని షాక్.. నిషేధిత జాబితాలోకి ఆ ముగ్గురి ఆస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇగిరేషన్ (Kaleshwaram Lift Irrigation) నిర్మాణంలో భాగస్వాములైన ప్రభుత్వ ఇంజినీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే ఏసీబీ (ACB) తనిఖీల్లో పట్టుబడిన మాజీ ఈఎన్సీ హరిరాం (Hariram), ఈఈ నూనె శ్రీధర్ (Sridhar), మాజీ ఈఎన్సీ మురళీధర్ (Muralidhar) ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ముగ్గురి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.400 కోట్ల పైచిలుకే ఉటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉండటంతో కోర్టులో కేసు తేలే వరకు ఆస్తుల విషయంలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపకుండా వారి ఆస్తులను విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చడం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, ఈ ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజినీరు నూనె శ్రీధర్ (Nune Sridhar) ఇళ్లు, బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించగా కళ్లు చెదిరే అక్రమాస్తులు స్వాధీనమైన విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖలో ఏఈఈగా చేరిన నూనె శ్రీధర్‌ జూన్‌లో అరెస్టయ్యే నాటికి ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పని చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏసీబీ.. శ్రీధర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, బినామీల పేరు మీద మొత్తం రూ.110 కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా గుర్తించారు.

ప్రాణహిత- చేవెళ్ల (Pranahitha - Chevella) సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంతో పాటు రీడిజైనింగ్‌ అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్‌ ఇంజినీరుగా కీలక పాత్ర పోషించిన భూక్యా హరిరాం (Hari Ram)ను ఈ ఏడాది మేలో ఏసీబీ అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆయన గజ్వేల్‌ ఈఎన్సీగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఎండీగా ఉన్నారు. హరిరాం అరెస్టు అనంతరం నీటిపారుదల శాఖ ఆయనను సస్పెండ్‌ చేసింది.

ఇక నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేసి రిటైర్ అయిన చీటి మురళీధర్‌ (Chiti Muralidhar)పై ఈ ఏడాది జులైలో ఏసీబీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించి అరెస్టు చేసింది. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Next Story