హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఊహించని సమస్య.. పలు విమానాలు రద్దు

by Ramesh Naini |   (  Updated:2025-12-03 11:28:30  IST  )

హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఊహించని సమస్య.. పలు విమానాలు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఏర్పడిన సమస్య కారణంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో చెక్‌ఇన్‌‌లో సమస్యలు తలెత్తాయి. మంగళవారం సాయంత్రం నుంచే ఈ సమస్య తలెత్తగా.. బుధవారం కూడా కొనసాగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హైదరాబాద్‌‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సమస్య కారణంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 33 ఫ్లైట్స్ రద్దు అయినట్లు అధికారుల సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఇబ్బందులు పడ్డారు.. దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది తంటాలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి. డిసెంబర్ 2న హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 9 ఫ్లైట్స్, ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన 5 ఫ్లైట్స్ రద్దు అయ్యాయి. డిసెంబర్ 3న హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 7 ఫ్లైట్స్, ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన 12 ఫ్లైట్స్ రద్దు అయ్యాయని అధికారుల సమాచారం. సమస్య కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంషాబాద్​ నుంచి ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, గోవా, భువనేశ్వర్‌ వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు ఎయిర్​పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. విమానం ఎప్పుడు వస్తుందో సిబ్బంది చెప్పడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో ఇదే..

Next Story