- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ పోలింగ్ కేంద్రంలో అనూహ్య ఘటన.. కత్తితో ఓటేసేందుకు వచ్చిన మహిళ
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బోగస్ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రాంనగర్‌లోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ తన వెంట కత్తిని తీసుకురావడాన్ని చూసిన తోటి ఓటర్లు, అక్కడున్న సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు మహిళను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కత్తిని ఎందుకు తీసుకువచ్చింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.






