- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాలలో ఊహించని పరిణామం.. మంత్రి వివేక్‌కు ఎదురుదెబ్బ
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురైంది. మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత ఇలాకాలో బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయకేతనం ఎగురవేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల (Manchiryal) జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy) సొంత నియోజకవర్గ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ (BRS), సీపీఐ (CPI) పార్టీలు ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం ఇక్కడ ప్రధానంగా కలిసివచ్చింది. ఈ రెండు పార్టీల బలం కలిపి 14 సీట్లకు చేరడంతో మున్సిపల్ పీఠం దక్కించుకోవడం సులువైంది. మొత్తం 22 వార్డులు ఉన్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు, సీపీఐ 4 వార్డులు, ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు.
బాల్క సుమన్ మార్క్ పాలిటిక్స్..
అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకుని, కేడర్‌ను సమన్వయం చేయడంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విజయవంతమయ్యారు. నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో అక్కడ బీఆర్ఎస్ ఎగిరింది. ఇక మంత్రి వివేక్ ఇలాకా కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో సీపీఐతో పొత్తు కుదరకపోవడం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాయి. అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఓటమిని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.






