Unemployment JAC : సురేఖ ఆత్మహత్యపై నిరుద్యోగ జేఏసీ ఆందోళన

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-24 06:37:41  IST  )

నిరుద్యోగి సురేఖ(Surekha) ఆత్మహత్య(Suicide)పై నిరుద్యోగ జేఏసీ(Unemployment JAC) ఆందోళనకు సిద్ధపడటంతో గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) వద్ధ భారీగా పోలీసులు(Police) మోహరించారు.

Unemployment JAC : సురేఖ ఆత్మహత్యపై నిరుద్యోగ జేఏసీ ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగి సురేఖ(Surekha) ఆత్మహత్య(Suicide)పై నిరుద్యోగ జేఏసీ(Unemployment JAC) ఆందోళనకు సిద్ధపడటంతో గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) వద్ధ భారీగా పోలీసులు(Police) మోహరించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాకు చెందిన గుగులోతు సురేఖ నిన్న సాయంత్రం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు సురేఖ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న నిరుద్యోగ జేఏసీ నాయకులు సురేఖ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆశోక్ నగర్ కు వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సురేఖ ఆత్మహత్యపై వాస్తవాలను పోలీసులు వెల్లడించాలని, సూసైడ్ నోట్ బయటపెట్టాని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడకుండా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వంటి సమస్యల సాకులు చెప్పకుండా జాబ్ క్యాలెండర్ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్ధని కోరారు.

Next Story