- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ గారు.. ఇదిగో ప్రూఫ్!
గ్రూపు-2 విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఇష్యూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-2 విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఇష్యూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదిలా ఉండగా.. దీనిని ప్రేమ వ్యవహారం వల్లే ప్రవళిక సూసైడ్ చేసుకుందని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రెస్మీట్‌లో అధికారికంగా వెల్లడించారు. మరోవైపు దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అసలు ప్రవళిక ఇప్పటివరకు ఎలాంటి పోటీ పరీక్ష రాయలేదని, కోచింగ్ కోసం 15 రోజుల క్రితమే హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చిందని మాట్లాడారు.
దీంతో నిరుద్యోగులు మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవళిక గ్రూపు-1,2,3,4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన పేపర్స్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి ‘కేటీఆర్ గారు.. ఇదిగో ప్రూఫ్’ అని పేర్కొన్నారు. పోలీసులు ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమే కారణమంటూ బ్లేమ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానిపై దర్యాప్తు చేయాలని ఆదేశించకుండా.. కేటీఆర్ కూడా వారిలానే మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని సీరియస్ అయ్యారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






