పండగ వేళ మరోసారి దిల్‍సుఖ్‍నగర్‌లో రోడెక్కిన నిరుద్యోగులు

by Ramesh Naini |

సంక్రాంతి పండగ వేళ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా హైదరాబాద్‌లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు.

పండగ వేళ మరోసారి దిల్‍సుఖ్‍నగర్‌లో రోడెక్కిన నిరుద్యోగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండగ వేళ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా హైదరాబాద్‌లో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో యువత నిరసనకు దిగింది. శనివారం దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టిన నిరుద్యోగులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు హామీలు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. పండగ సమయమైనప్పటికీ తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు.

Next Story