- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైట్ తీసుకున్న తెలంగాణ నిరుద్యోగులు.. అసలు రీజన్ ఏంటి?
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) అప్‌డేట్ విషయంలో అలసత్వం వహించినట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) అప్‌డేట్ విషయంలో అలసత్వం వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిషన్ ఓటీఆర్ అప్డేట్ గడువును రెండుసార్లు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 31.56 లక్షల మంది నిరుద్యోగులు కమిషన్ వెబ్‌సైట్‌లో గతంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటివరకు కేవలం సుమారు 7 లక్షల మంది మాత్రమే తమ వివరాలను అప్‌డేట్ చేసుకున్నట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వెలువడే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీఆర్ అప్‌డేషన్ ప్రాథమిక నిబంధనగా కమిషన్ పేర్కొంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదనంగా పొందిన విద్యార్హతలను చేర్చుకోవాల్సి ఉంటుంది. పాత డేటాలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించింది. నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత ఒక్కసారిగా అందరూ అప్‌డేట్‌కు ప్రయత్నిస్తే వెబ్‌సైట్ సర్వర్ మొరాయించే ప్రమాదం ఉంది. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ పేర్కొంది.
రెండుసార్లు గడువు పొడిగింపు..
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) డేటాను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని 5 నెలల క్రితమే టీజీపీఎస్సీ ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ, అభ్యర్థుల విద్యార్హతల్లో మార్పులు, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఓటీఆర్ డేటాను కమిషన్ అప్‌డేట్ చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో జాప్యాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ఓటీఆర్ అప్‌డేట్‌కు జనవరి 9 వరకు ఉన్న గడువును ఫిబ్రవరి 25 వరకు పెంచారు. అనంతరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25 వరకు నెలరోజుల పాటు మరోసారి పొడిగించారు. మూడోసారి మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగించారు.
కొత్త నోటిఫికేషన్లకు ఓటీఆర్ అప్డేట్ ప్రామాణికం..
రాబోయే నోటిఫికేషన్లలో ఓటీఆర్ ప్రామాణికంగా తీసుకుంటామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని జనవరిలో టీజీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలపై కసరత్తు చేసి మే నుంచి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఓటీఆర్ అప్డేట్ నిరుద్యోగుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మూడుసార్లు గడువు పొడిగించినా అభ్యర్థులు సర్టిఫికెట్లు తీసుకోవడంలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. దీనిపై కమిషన్ స్పందించి ఓటీఆర్ అప్డేట్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
అంచనాలు వేల కోట్లు.. కేటాయింపులు వందల కోట్లు: పాలమూరు పనులు ముందుకు సాగేనా?






