- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంచనాలు వేల కోట్లు.. కేటాయింపులు వందల కోట్లు: పాలమూరు పనులు ముందుకు సాగేనా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు ముదురుతున్న వేళ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రజల్లో చర్చ నడుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు ముదురుతున్న వేళ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రజల్లో చర్చ నడుస్తున్నది. కాళేశ్వరం విషయంలో చూపుతున్న చురుకుదనం పాలమూరుపై చూపించడం లేదని వాదన కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు రూ.22 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినప్పటికీ తాజా బడ్జెట్లో కేవలం రూ.1,800 కోట్లు మాత్రమే కేటాయించడం విమర్శలకు తావిస్తున్నది. అవసరానికి తగ్గ నిధులు లేకుండా పనులు ఎలా పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అంచనాలు రెట్టింపు..
2015లో రూ.35,250 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వ్యయం 2023 నాటికి రూ.55,086 కోట్లకు చేరింది. అయితే.. తాజా లెక్కల ప్రకారం మొత్తం వ్యయం రూ.85 వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నదని నీటిపారుదల శాఖ భావిస్తున్నది. ఇప్పటికే రూ.32,067 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాన కాలువలు, కొన్ని రిజర్వాయర్లు, లిఫ్టుల నిర్మాణంలో పురోగతి ఉన్నప్పటికీ, డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్, పిల్ల కాలువలు ఇంకా పూర్తి కాలేదు. లిఫ్టుల్లో కూడా సగం వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తికాకుండా ప్రాజెక్టు ఫలితాలు సాధ్యం కావు. లిఫ్టుల్లోనూ సగం వరకు మాత్రమే పంపులు, మోటార్లు అమర్చారు. మిగిలిన భాగం పూర్తి కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం మిగిలిన పనులను పూర్తి చేయాలంటే కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మాణం, సబ్ కెనాల్, పిల్ల కాలువలతోపాటు సుమారు 33,500 ఎకరాల భూసేకరణ అంశం కీలకంగా మారింది. అయితే భూసేకరణకే సుమారు రూ.7వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు.
భూసేకరణ భారీ సవాల్..
సుమారు 33,500 ఎకరాల భూసేకరణ ఇంకా మిగిలి ఉండగా, దానికి మాత్రమే రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా. రైతుల డిమాండ్లు, మార్కెట్ ధరల పెరుగుదలతో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశముంది. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించినప్పటికీ అన్ని చోట్ల సమాన పురోగతి లేదు. ముఖ్యంగా కాలువల నిర్మాణం పూర్తికాకపోతే 12.3 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారీగా నిధులు అవసరమని చెబుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో మాత్రం కేవలం రూ.1,800 కోట్లు మాత్రమే కేటాయించడం రైతులను అసంతృప్తికి గురిచేసింది. అవసరానికి తగ్గ నిధులు లేకుండా పనులను వేగవంతం చేయడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇంకా కనీసం రూ.14,602 కోట్లు అదనంగా వెచ్చిస్తేనే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టినప్పటికీ, అన్ని ప్యాకేజీల్లో సమానంగా పురోగతి లేదు. ముఖ్యంగా చివరి దశ పనులు అయిన కాలువల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయాల్సి ఉన్నది. ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డికి మరిన్ని నిధులు కేటాయించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.






