HYD: విషాదం నింపిన భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు

by Gantepaka Srikanth |

భారీ వర్షం హైదరాబాద్‌(Hyderabad)లో విషాదం నింపింది. ఆసిఫ్‌నగర్‌ అఫ్జల్‌సాగర్‌లోని మంగారుబస్తీలో ఇద్దరు గల్లంతు అయ్యారు.

HYD: విషాదం నింపిన భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షం హైదరాబాద్‌(Hyderabad)లో విషాదం నింపింది. ఆసిఫ్‌నగర్‌ అఫ్జల్‌సాగర్‌లోని మంగారుబస్తీలో ఇద్దరు గల్లంతు అయ్యారు. నాలాలో మామ, అల్లుడు(Uncle, son-in-law Missing) కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది.. మామ, అల్లుడు కోసం గాలిస్తున్నారు. అఫ్జల్‌సాగర్‌ నాలాను దాటే క్రమంలో అదుపుతప్పి నాలాలో పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముషీరాబాద్‌లోనూ ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా, గోడ కూలడంతో సన్నీ (24) గల్లంతయ్యాడు. సన్నీ కోసం కూడా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Next Story