- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడు లేని జీవితాన్ని ఊహించుకోలేక.. శ్మశానంలో యువతి వీరంగం
ఈ మధ్యకాలంలో ప్రేమలో పడడం కామన్ అయిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ప్రేమలో పడడం కామన్ అయిపోయింది. అయితే కొంతమంది ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి సక్సెస్ అవుతుండగా.. మరి కొందరు మధ్యలోనే విడిపోయి ఎవరి లైఫ్‌ను వారు చూసుకుంటున్నారు. కొందరు బ్రేకప్‌ను తట్టుకోలేక దారుణాలకూ పాల్పడుతున్నారు. తాజాగా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నగరంలోని పంజాగుట్ట ఏరియాలో ఓ యువతి ప్రేమించిన అబ్బాయి మరణించాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక.. అతడు లేని జీవితం ఊహించుకోలేను అంటూ ఆదివారం అర్థరాత్రి స్మశానంలో వీరంగం సృష్టించింది. ఆ అమ్మాయి కూడా చనిపోతానని గట్టిగా ఏడుస్తూ అరుపులు కేకలతో హోరెత్తించింది. దీంతో ఆ యువతి అరుపులు గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబసభ్యులను పిలిపించి, వారికి అప్పగించారు.






