- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Umda Nagar : ఉందానగర్ రైల్వే స్టేషన్.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి
అమృత్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చెందుతున్న 40 రైల్వే స్టేషన్లలో (Umda Nagar) ఉందానగర్ రైల్వే స్టేషన్ ఒకటి.

దిశ, డైనమిక్ బ్యూరో: అమృత్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చెందుతున్న 40 రైల్వే స్టేషన్లలో (Umda Nagar) ఉందానగర్ రైల్వే స్టేషన్ ఒకటి. మొత్తం రూ.12.37 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటికే 79 శాతం పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పునరాభివృద్ధి పనులలో భాగంగా స్టేషన్ భవనం విస్తరణ, ప్రయాణికుల వెయిటింగ్ హాల్, పే & యూజ్ టాయిలెట్, పార్కింగ్ షెడ్లు, ప్లాట్‌ఫామ్-01 వద్ద రిటైనింగ్ వాల్, అలాగే ఎగ్జిట్ ఆర్చ్ నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే వెయిటింగ్ హాల్‌లో రూఫ్ స్లాబ్, ప్లాస్టర్ పనులు ముగించగా, స్టేషన్ భవనం విస్తరణలో విండోస్ గ్రానైట్, గ్రిల్ ఫిక్సింగ్ పనులు పూర్తి చేశారు.
పార్కింగ్ షెడ్లకు పీడెస్టల్ వరకు ఫౌండేషన్ పనులు పూర్తి కాగా, పే & యూజ్ టాయిలెట్‌ను కూడా సిద్ధం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ పనుల ఫోటోలను పంచుకున్నారు. ఉందానగర్ స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఉందానగర్ రైల్వేస్టేషన్ హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారిపై, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.
- ప్రాజెక్టు వ్యయం: ₹12.37 కోట్లు
- పనుల పురోగతి: 79% పూర్తి






