New Zealand: తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు

by Gantepaka Srikanth |

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(Telangana Association of New Zealand) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు(Ugadi Celebrations) నిర్వహించారు.

New Zealand: తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(Telangana Association of New Zealand) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు(Ugadi Celebrations) నిర్వహించారు. తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆక్లాండ్ నగరంలో ఈ ఉత్సవాలు చేశారు. పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను తెలుసుకొని, చిన్నారులు పెద్దలు సామూహిక భోజనం చేశారు.


కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన మోనిక-శ్రీకాంత్‌తో పాటు సామాజికసేవలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాల(Ugadi Awards)తో గౌరవంగా సన్మానించారు. ఉత్సవాల్లో పాల్గొన్న చిన్నారులకు, నృత్యకారులకు బహుమతులు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్, శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి, కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్, రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Next Story