- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: యూఏఈ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలి: శ్రీధర్ బాబు
యూఏఈ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: యూఏఈ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడికి ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పిలుపునిచ్చారు. ఇవాళ హెచ్‌ఐసీసీలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సుకు (Investopia Global Conference) మంత్రి శ్రీధర్‌బాబు, యూఏఈ మినిస్టర్ అబ్దుల్లా బిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో డ్రైపోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఫిన్ టెక్, స్మార్ట్ మొబిలిటీ, క్లెమెట్ టెక్ లకు కేంద్రంగా తెలంగాణ మారబోతున్నదన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు.






