Edupayala Temple : ఏడుపాయల ఆలయంలో అపశృతి..ఇద్ధరు యువకుల మృతి

by Y. Venkata Narasimha Reddy |

మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ మాత(Edupayala Temple) దర్శనానికి వచ్చిన ఇద్దరి యువకులు(Two youths) నీటిలో మునిగి మృతి చెందిన(Drowned in water and died) ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Edupayala Temple : ఏడుపాయల ఆలయంలో అపశృతి..ఇద్ధరు యువకుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ మాత(Edupayala Temple) దర్శనానికి వచ్చిన ఇద్దరి యువకులు(Two youths) నీటిలో మునిగి మృతి చెందిన(Drowned in water and died) ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఏడుపాయల వనదుర్గ దర్శనానికి వచ్చిన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో ఈతపై సరదాతో స్నానాల కోసం నదిలోకి దిగారు. వారిలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు.

మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్ కు చెందిన కృష్ణ (20), షామా(21)గా గుర్తించారు. సమాచారం అందుకున్న కొల్చారం పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story