చరిత్ర సృష్టించడమే మా లక్ష్యం.. ‘స్పిరిట్’ పంపిణీపై నిర్మాతల సంచలన ప్రకటన!

by Mallepaka Hamsa |

‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్’తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది.

చరిత్ర సృష్టించడమే మా లక్ష్యం.. ‘స్పిరిట్’ పంపిణీపై నిర్మాతల సంచలన ప్రకటన!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. త్రిప్తి డిమ్రి హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ సినిమా థియేట్రికల్ పంపిణీకి సంబంధించి మేకర్స్ ఒక సంచలన ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ‘స్పిరిట్’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ సంస్థ ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్’తో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది.

భారతదేశపు అతిపెద్ద స్టార్ ప్రభాస్‌పై కర్ణాటక ప్రజలు ఎప్పుడూ అపారమైన ప్రేమను చూపిస్తూనే ఉంటారని, ఈసారి వారందరితో కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని మేకర్స్ తెలిపారు. కర్ణాటక భారతీయ సినిమాకి అత్యంత బలమైన మార్కెట్లలో ఒకటి కావడంతో, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యం ప్రేక్షకులకు మరుపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుందని, అంతేకాకుండా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందని చిత్రబృందం తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

Next Story