- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదం తొక్కిన మహిళలు.. తెలంగాణ ఎన్నికల్లో ఖాతా తెరిచిన టీడీపీ, జనసేన
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం , జనసేన పార్టీ అభ్యర్థులు వార్డు కౌన్సిలర్లగా ఇద్దరు మహిళా అభ్యర్థులు గెలుపొందారు..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో జరిగిన మున్సిపల్(Muncipal), కార్పొరేషన్(Corporation) ఎన్నికల్లో(Elections) దాదాపు ఫలితాలు వెల్లడయ్యాయి. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థులు విజయం సాధించారు. సెకండ్ ప్లేస్‌లో బీఆర్ఎస్(Brs) నిలిచింది. బీజేపీ(Bjp), ఇతర పార్టీలు సైతం పలు స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థులు సైతం పోటీ చేశారు. టీడీపీ(Tdp), జనసేన(Janasena) కూడా విజయం సాధించాయి. అయితే ఒక్కో స్థానంలో మాత్రమే. సూర్యాపేట జిల్లా నేరుడు చర్లలోని 14వ వార్డు కౌన్సిలర్‌గా జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొందారు. ఇక ఖమ్మం జిల్లా మధిరలో 10వ వార్డు కౌన్సిలర్‌గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. ఈ రెండు పార్టీలు చెరో చోట విజయం సాధించి తెలంగాణ ఎన్నికల్లో బోణీ కొట్టాయి. దీంతో ఆయా వార్డుల్లో జనసేన, టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇకపై జరిగే ఎన్నికల్లోనూ తాము ఇదే విధంగా విజయాలు సాధించామని అభ్యర్థులు విజయలక్ష్మి, రేవతి దీమా వ్యక్తం చేశారు.






