- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టోలిచౌకిలో ఇద్దరు నైజీరియన్ డ్రగ్ సప్లయర్స్ అరెస్ట్.. రూ.20 లక్షల విలువైన mdma సీజ్
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టోలిచౌకి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా ఇద్దరు నైజీరియన్ డ్రగ్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టోలిచౌకి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా ఇద్దరు నైజీరియన్ డ్రగ్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల MDMA డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్ డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులను చిడి ఈజెహ్ అలియాస్ నారాయనన్, ఓబసి జేమ్స్ విక్టర్‌గా పోలీసులు గుర్తించారు. టోలిచౌకి పోలీసులతో కలిసి హెచ్-న్యూ (HNEW) పోలీస్ టీమ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించిదని అధికారి వైభవ్ గైక్వాడ్ తెలిపారు.
గోవా మీదుగా డ్రగ్స్ అక్రమ రవాణా
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో మూడు డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ ఇద్దరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలై తమ గుర్తింపును మార్చుకొని ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగించినట్లు వెల్లడైంది. అనంతరం గోవా మీదుగా డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నైజీరియన్ అయినప్పటికీ వారు భారతీయ పేర్లు వాడుతూ, నాగేశ్వరన్ వంటి పేర్లతో ఫేక్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరిద్దరి టూరిస్ట్ వీసా, పాస్‌పోర్ట్ గడువు ఇప్పటికే ముగిసినట్లు అధికారులు గుర్తించారు. నిందితులను డిపోర్ట్ చేసి వారి స్వదేశానికి పంపించడంతో పాటు, బ్లాక్ లిస్ట్‌లో చేర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ స్పష్టం చేశారు.






