- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. మరో రెండు రోజులు సెలవులు
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో గురువారం కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో గురువారం కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లడం, చెరువులు కట్టలు తెగి ప్రవహించడం, రోడ్లు కొట్టుకుపోవడం, వరదతో ఇళ్ళు మునిగిపోవడం వంటి కారణాల వల్ల రేపు, ఎల్లుండి కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాలతో డీఈవో శుక్రవారం, శనివారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోవడంతో గ్రామాలకు మధ్య, పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా ఈరోజు, రేపు కూడా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.






