HYD: జగ్గారెడ్డితో ద్విసభ్య కమిటీ సభ్యుల భేటీ.. కొలిక్కి వచ్చినట్టేనా?

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ద్విసభ్య కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు.

HYD: జగ్గారెడ్డితో ద్విసభ్య కమిటీ సభ్యుల భేటీ.. కొలిక్కి వచ్చినట్టేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ద్విసభ్య కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గ రాజకీయాలపై జగ్గారెడ్డితో చర్చించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ విభేదాలపై ద్విసభ్య కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) నియోజకవర్గ కాంగ్రెస్‌లో పాత, కొత్త నాయకుల మధ్య విభేదాల తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాలను పరిష్కరించేందుకు పీసీసీ నియమించిన కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇటీవలే కమిటీ సభ్యులు జిల్లా మంత్రి దామోదర్‌ రాజనర్సింహతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి అభిప్రాయం తీసుకున్నారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో ముందుకెళ్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి పేర్కొన్నట్లు సభ్యులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నామని, ఆ జిల్లాకు చెందిన జగ్గారెడ్డిని కలిస్తే తమ విచారణ పూర్తవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జగ్గారెడ్డితో భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌ ఓడిపోగా.. ఆయనపై ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఇరువర్గీయుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Next Story