- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారోత్సవాల వేళ ‘అన్న’లకు భారీ ఎదురుదెబ్బ.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ ‘అన్న’లకు ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, భద్రాచలం: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ ‘అన్న’లకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మాడ్ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరుగుతున్నది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రరెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, ఘటనా స్థలం నుంచి ఏకే 47తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
Next Story






