- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు కీలక నేతలు
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మక్తల్ బీజేపీ నేత జలందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మెదక్ బీజేపీ నేత పులిమామిడి రాజు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయితే వారంరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం.. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story






