- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 25 నుంచి ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్..SIR పై సీఈవో కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు సీఈఓ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెల 15వ తేదీ నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ) ప్రక్రియ మొదలవుతుందని జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఎల్‍వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‍లు ఇస్తారని ప్రతి ఓటర్ కు రెండు ఎన్యుమరేషన్ ఫామ్ లు ఇస్తారు. ఒకటి పూర్తి చేసి మళ్లీ మాకు ఇవ్వాల్సి ఉంటుందని ఇంకో ఎన్యుమరేషన్ ఫామ్ ను ఓటర్ దగ్గరే అన్ నాలెడ్జ్ ఫామ్ గా ఉంటుందన్నారు. ఆన్ లైన్ లోనూ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫామ్‍లు సేకరించి జులై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని, అభ్యంతారుల పరిశీలించాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎన్ఐఆర్ ప్రక్రియ జరిగిందని దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగబోతున్నదన్నారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు.






