- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్ల కు న్యూఢిల్లీలో రెండు రోజుల శిక్షణ
భాతర ఎన్నికల సంఘం ఆద్వర్యంలో న్యూ ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్ల కోసం రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భాతర ఎన్నికల సంఘం ఆద్వర్యంలో న్యూ ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్ల కోసం రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ మాట్లాడుతూ ఓటు విలువను కాపాడటంలో ఎన్నికల సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది, అధికారులు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు. ఎన్నికల విభాగం సామర్థ్యాన్ని బలపరిచేందుకు, భద్రతాయుత ఎన్నికల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహనకు కావల్సిన అంశాలపై అవగాహన పెంచుకొని అవసరమైనప్పుడు అమలు చేయాలని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుధర్శన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టితో కలిసి శిక్షణ తరగతుల్లో పాల్గొని, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిర్వాహక వ్యవస్థలో నెమ్మదిగా కానీ ప్రభావవంతంగా మార్పు తీసుకురావాలంటే, గ్రామ స్థాయి అధికారుల శ్రమే పునాదిగా ఉండాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇది క్షేత్ర స్థాయిలో స్థాయిలో ఓటర్ల నమోదు, ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యాన్ని మరింతగా బలపరిచే ప్రాధాన్యాన్ని కలిగి ఉందన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఓటర్ల నమోదు విధానం, ఎన్నికల జాబితాల ఖచ్చితత్వం, డిజిటల్ టూల్స్ వినియోగం, ఎన్నికల నియమావళిపై అవగహన వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ శిక్షణ ఖచ్చితత్వం, బాధ్యతాయుతంగా వ్యవహరించడాని సహాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 మంది బూత్ స్థాయి అధికారులు, 56 మంది బూత్ స్థాయి సూపర్ వైజర్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.
* రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైనా ముఖ్యమైన ఓటర్ల నమోదు అధికారులు
న్యూఢిల్లీలో రెండు రోజుల నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ముఖ్యమైన ఓటరు నమోదు అధికారులు హాజరయ్యారు. టి.వినోద్ కుమార్, రా జేంద్ర కుమార్, ఎస్.రమేష్ బాబు, డి.దేవుజా, శ్రీను, జి.అంజనేయులు, వి.సమ్మయ్య, ఈ.నవీన్ కుమార్, వై.అశోక్ రెడ్డి, జి.గణేష్, ఎం.రాజేశ్వరి ఉన్నారు.






