- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి ప్రేమకు దూరం.. తండ్రి లాలన కరువు.. అనాథలైన ఇద్దరు చిన్నారులు
అనాథ.. అనడానికి అల్కగనే అనిపించొచ్చు కానీ ఆ జీవితాన్ని మోయడం చాలా పెద్ద భారం.. ఇప్పుడు ఆ భారాన్ని మోయడానికి ఇద్దరు చిన్నారు సిద్ధం అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్ : అనాథ(Orphan).. అనడానికి అల్కగనే అనిపించొచ్చు కానీ ఆ జీవితాన్ని మోయడం చాలా పెద్ద భారం.. ఇప్పుడు ఆ భారాన్ని మోయడానికి ఇద్దరు చిన్నారు సిద్ధం అయ్యారు. ముక్కుపచ్చలారని వయసులో తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆలనా పాలనా చూసే వారు లేక అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారుల విషాద గాద ఇది.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని గట్టికల్ ((Gattikal)) గ్రామానికి చెందిన మోరపాక రాములుకు ఇద్దరు కుమారులు.. ఓ నాలుగు సంవత్సరాల క్రితం రాములు భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటికి రాములు చిన్న కుమారుడు 18 నెలల పసివాడు.. పాలు తాగే వయసు.. తల్లి ఎందుకు చనిపోయిందో తెలియదు.. తండ్రికి అంత చిన్న పసి కూనను ఎలా సాకాలో అర్థం కాలేదు..
చిన్నారి ఏడుపును చూడలేక ఇంటిపక్కనే ఉండేటి ఒక ఆర్టీసీ డ్రైవర్ రాచకొండ రమేష్, హేమలత దంపతులు చేరదీశారు.. చిన్నారికి ఆలనా పాలనా అన్ని తామే అయ్యారు. నాటి నుండి నేటి వరకు ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఆ దంపతులు.. ఇంతలోనే మరో విషాద గాధ.. నాలుగు రోజుల క్రితం చిన్నారుల తాత మృతి చెందాడు.. ఆ మరణ వార్త మరవకముందే రెండు రోజుల వ్యవధిలోనే తండ్రి రాములు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారు అనాథలయ్యారు.. ప్రస్తుతం వారి జీవితంలో చీకటి తప్ప వెలుతురు లేని జీవులుగా మిగిలిపోయారు.. వారి బాధను మోయలేము.. వారి కష్టాన్ని మనం ఎవ్వరం తీర్చలేము.. తల్లిదండ్రుల ప్రేమను పంచలేము.. కానీ తోచినంత సహాయం చేసి చేయుతనిద్దాం.. వారికి సహాయం చేయాలనుకునే వారు ఈ కింది నెంబర్ కు ఫోన్ పే ద్వారా పంపించండి.. phone pay No 9490536944






