ట్విన్స్ డే రోజున కవలల పెళ్లి..నెలలోపే తీవ్ర విషాదం

by velandi.Saikiran |

కామారెడ్డి జిల్లాలో స‌రిగ్గా నెల రోజుఏల కింద‌ట‌ కవలలను పెళ్లాడిన యువకుల్లో ఒకరైన దుంపటి వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్విన్స్ డే రోజున కవలల పెళ్లి..నెలలోపే తీవ్ర విషాదం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కామారెడ్డి జిల్లా ఘనపూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్విన్స్ డే రోజున కవలలను మరో ఇద్దరు కవలలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కవలల జంటల్లో ఒక నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి జరిగి నెల రోజులు కాకముందే కొత్తపెళ్లి కొడుకు వినయ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో స‌రిగ్గా నెల రోజుఏల కింద‌ట‌ కవలలను పెళ్లాడిన యువకుల్లో ఒకరైన దుంపటి వినయ్ కుమార్ (31) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉగాది పండుగ రోజు ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి వినయ్ రాలేదు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి, దుంపటి వినయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్ నగరంలోని ఒక కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న వినయ్, ఉగాది పండ‌గ నేప‌థ్యంలో ఘనపూర్ కు వ‌చ్చాడు. ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, మానేరులో దూకి, ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి వినయ్ మృతికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన నేప‌థ్యంలో ఘ‌న‌పూర్ లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఇది ఇలా ఉండ‌గా, నెల రోజుల కింద‌ట ఘనపూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే ఇద్దరూ కవలలను దేమికలాన్‌కు చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే మరో ఇద్దరు కవలలు వివాహమాడారు. క్లిక్

Next Story