- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంచ గచ్చిబౌలి భూములపై బిగ్ ట్విస్ట్.. ఆ భూముల కోసం సుప్రీంకోర్టుకు నిజాం వారసులు
కంచగచ్చిబౌలి భూముల విషయంలో నిజాం వారుసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర దుమారం రేపిన శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి భూముల (Kanch Gachibowli land dispute) విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తుండగా తాజాగా బిగ్ ట్విస్ట్ నమోదైంది. కంచగచ్చిబౌలిలో ఉన్న 2,725 ఎకరాల 23 గుంటల భూమికి నిజమైన యజమాని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (7th Nizam) అని ఆయన వారుసులు తాజాగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆ భూములపై యాజమాన్య హక్కు తమదేనని వాదిస్తూ కంచి గచ్చిబౌలి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశామని చెబుతున్నారు. కాగా కంచ గచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.






