- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IFS, IRS పంచాయితీ కేసులో ట్విస్ట్.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి
IRS అధికారిణిని వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న IFS అధికారి సుతాన్ సింగ్ క్వార్టర్‌లో షాకింగ్ దృశ్యాలు పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య మొదలైన లైంగిక వేధింపుల పంచాయితీ ఇప్పుడు మరో మలుపులు తిరుగింది. ఐఆర్ఎస్ (IRS) అధికారిణి నితికా సింగ్ (Nitika Singh)ను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎఫ్ఎస్ (IFS) అధికారి సుతాన్ సింగ్ (Sutan Singh) ఉదంతంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు, సుతాన్ సింగ్ నివాసంలో విస్తుపోయే దృశ్యాలు దర్శనమిచ్చాయి. తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుతాన్ సింగ్, తనను వేధిస్తున్నారని ఐఆర్ఎస్ అధికారిణి నితికా సింగ్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు నిన్న రాత్రి సుతాన్ సింగ్ ఉంటున్న క్వార్టర్స్‌కు వెళ్లారు. అక్కడ అతడి పరిస్థితి చూసి వారు షాక్‌కు గురయ్యారు.
క్వార్టర్‌లో ‘గజినీ’ మూవీ తరహా రాతలు..
సుతాన్ సింగ్ ఉంటున్న ఇంటి గోడల నిండా పిచ్చి గీతలు, వింత రాతలు కనిపించాయి. ‘గజినీ’ (Ghajini) సినిమాను తలపించేలా గోడలపై ఉన్న ఆ రాతలను చూస్తుంటే, ఆయన తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్వార్టర్‌లో ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటున్న సుతాన్ సింగ్ ప్రవర్తన అసాధారణంగా ఉన్నట్లు అధికారులు గమనించారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. సుతాన్ సింగ్‌ను దుండిగల్ ఫారెస్ట్ ఏరియా (Dundigal Forest Area)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత హోదాలో ఉండి, తోటి మహిళా అధికారిణిని వేధించడమే కాకుండా, ఇలాంటి వింత ప్రవర్తన కలిగి ఉండటం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు ఆయన మానసిక స్థితిపై వైద్య నిపుణుల సలహా తీసుకునే యోచనలో ఉన్నారు. వేధింపుల వెనుక అసలు కారణాలు ఏంటి..? ఆయనకు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది.. అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.






