చంద్రబోస్ సోదరుడి మరణంలో ట్విస్ట్.. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 02:09:12  IST  )

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది.

చంద్రబోస్ సోదరుడి మరణంలో ట్విస్ట్.. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) సోదరుడు రాజేందర్ మరణం విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దుండిగల్ (Dundigal) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేటలోని డాలర్‌ డ్రీమ్స్‌లో రాజేందర్ (Rajender), వసంత (Vasantha) దంపతులు నివసిస్తున్నారు. వృత్తిరీత్య రాజేందర్ రియాల్టర్‌గా ఉన్నాడు. అయితే, గత నెల 18న అతడు భార్య వసంతకు బెంగళూరు వెళ్తున్నట్లుగా చెప్పాడు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ అన్నమయ్య జిల్లా కలికిరి ప్రధాన రహదారిపై రాజేందర్‌ మృతి చెందినట్లుగా కుటుంబసభ్యులకు ఆ ప్రాంత పోలీసులు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని ఇక్కడికి తరలించగా బాచుపల్లిలోని మమతా ఆసుపత్రిలో భద్రపరిచారు. అయితే, రాజేందర్‌ డెడ్‌బాడీపై గాయాలున్నాయని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య తాజాగా దుండిగల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ చేసి అన్నమయ్య జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీచేశారు. తన భర్తతో పాటు శ్రీనివాస్, సుధీర్‌ అనే ఇద్దరు వెళ్లినట్లుగా ఫిర్యాదులో వసంత పేర్కొన్నారు.

Next Story