- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్
డిసెంబర్ 24న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 24న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 15 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు కారు ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేదని.. పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని పిటీషన్‌లో తెలిపారు. పోలీసులు ఆసీఫ్ ను భయభ్రాంతులకు గురిచేసి తన పేరు చెప్పేలా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ యాక్సిడెంట్ లో ఎవరి ప్రాణాలు పోలేదని.. కావాలనే ర్యాష్ డ్రైవింగ్ కేసును హైలెట్ చేసి తనను ఇరికించారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని వెంటనే ఎఫ్ఐఆర్ కొట్టేయాలని హైకోర్టును సాహిల్ కోరారు. పిటిషన్ పై తెలంగాణ హై కోర్టు విచారణ చేపట్టనుంది.
Next Story






