కోఠి కాల్పుల ఘటనలో ట్విస్ట్.. పోలీసులనే మిస్ లీడ్ చేసిన నిందితులు

by Ajay Maddhiboyina |

కోఠిలో కాల్పుల కలకలం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద కాల్పులకు పాల్పడి డబ్బులు కొట్టేసిన దుండగులు బాదితుడి బైక్ పైనే పరార్ అయ్యారు.

కోఠి కాల్పుల ఘటనలో ట్విస్ట్.. పోలీసులనే మిస్ లీడ్ చేసిన నిందితులు
X

దిశ, వెబ్ డెస్క్: కోఠిలో కాల్పుల కలకలం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద కాల్పులకు పాల్పడి డబ్బులు కొట్టేసిన దుండగులు బాదితుడి బైక్ పైనే పరార్ అయ్యారు. ఈ క్రమంలో సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా పోలీసులనే మిస్ లీడ్ చేసినట్టు తెలిసింది. దుండగులు స్కూటీని వదిలేసి కాచిగూడ రైల్వే స్టేషన్ లోకి వెళ్లినట్టు నటించారు. కానీ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ డీమార్ట్ వద్ద దుస్తులు మార్చుకుని, క్యాప్ పెట్టుకుని కొత్తవేషాదారణలో పరార్ అయ్యారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులు ఏ రూట్ లో వెళ్లారు అనేదానిపై పోలీసులు ఐదు బృందాలుగా ఆరా తీస్తున్నాయి. వంద‌లాది సీసీ కెమెరాల‌ను పరిశీలిస్తూ పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెల్ల‌వారుజామున న‌గ‌రంలో తుపాకి కాల్పులు జ‌ర‌గ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల కాలంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు హైద‌రాబాద్ లో త‌ర‌చూ జ‌ర‌గ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో గ‌న్ క‌ల్చ‌ర్ పెరిగిపోయింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Next Story