అసెంబ్లీ సమావేశాల వేళ ట్విస్ట్.. స్పీకర్‌ను కలిసిన ఆ ఇద్దరు BRS ఎమ్మెల్యేలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-29 09:52:44  IST  )

తెలంగాణ శాసనసభ సమావేశాలకు సమయం ఆసన్నమైంది.

అసెంబ్లీ సమావేశాల వేళ ట్విస్ట్.. స్పీకర్‌ను కలిసిన ఆ ఇద్దరు BRS ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి 5 రోజుల పాటు సభను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇదే భేటీలో భాగంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandraghosh) ఇచ్చిన రిపోర్టుకు ఆమోదం తెలిపి.. అసెంబ్లీలో చర్చించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్‌ (Vivekananda Goud)తో పాటు సుధీర్ రెడ్డి (Sudheer Reddy) కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Speaker Prasad Kumar)ను అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ (Kaleshwaram Lift Irrigation)పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుమతిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన స్పీకర్.. వారి రిక్వెస్ట్‌ను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అయితే, కాళేశ్వరంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అధికార పక్షం అనుమతిస్తుందా.. సభలోనే కౌంటర్ అటాక్ చేస్తుందా అనేది సస్పెన్స్‌గా మారింది.

Read More : Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఉన్నతాధికారులతో స్పీకర్ కీలక సమీక్ష

Next Story