టీవీవీపీ - డీఎస్‌హెచ్‌ఎస్‌ మార్పుతో వేతనాల ఆలస్యం! 20న అందిన జీతాలు

by Ramesh Naini |

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని రద్దు చేసి, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్‌)గా మార్చే ప్రక్రియపై గవర్నర్ ఆమోదం కొనసాగుతున్న నేపథ్యంలో వేతనాల చెల్లింపులో తీవ్ర ఆలస్యం జరిగింది.

టీవీవీపీ - డీఎస్‌హెచ్‌ఎస్‌ మార్పుతో వేతనాల ఆలస్యం! 20న అందిన జీతాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని రద్దు చేసి, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్‌)గా మార్చే ప్రక్రియపై గవర్నర్ ఆమోదం కొనసాగుతున్న నేపథ్యంలో వేతనాల చెల్లింపులో తీవ్ర ఆలస్యం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో అందాల్సిన వేతనాలు సోమవారం (ఏప్రిల్ 20) నాడు రావడంతో సుమారు 7 వేల మంది వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈఎంఐలు చెల్లించే సమయం దాటిపోవడంతో క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతోందని వారు వాపోయారు. ఈ నెలాఖరు వరకైనా టీవీవీపీని డీఎస్‌హెచ్‌ఎస్‌గా మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story