- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికార పార్టీలో అలజడి.. బీర్ల ఐలయ్యపై ఎమ్మెల్యే సామెల్ తీవ్ర ఆరోపణలు
అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఆరోపణలు అలజడి రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah)పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ (Mandula Samel) సంచనల ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లాలో నేతలు కొందరు బీఆర్ఎస్ (BRS) పార్టీతో పొత్తు పెట్టుకున్నారని బీర్ల ఐలయ్యను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. తమ బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేయొద్దని ఫైర్ అయ్యారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ, గెలిస్తే.. నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్మకాలి కాంగ్రెస్ పార్టీ ఓడితే కార్యకర్తలే ఆయనకు బుద్ధి చెబుతారంటూ మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, మదర్ డెయిరీ (Mother Dairy) ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉప్పు, నిప్పుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) ఒక్కటయ్యాయి. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక చోట బీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బద్ద శత్రువులుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం హాట్ టాపిక్‌గా మారింది.






