Tungabhadra : ఉదృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర.. మత్స్యకారులకు అలర్ట్

by Sathputhe Rajesh |

ఎగువన కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది.

Tungabhadra : ఉదృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర.. మత్స్యకారులకు అలర్ట్
X

దిశ, రాజోలి : ఎగువన కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది. ఆదివారం సుంకేసుల డ్యామ్‌కు ఎగువ నుంచి 1,43,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం డ్యామ్‌లో 0.438 టీఎంసీ నీటి నిల్వను కొనసాగిస్తూ 28 గేట్లు తెరచి 1,40,478 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి, కేసీ కెనాల్ ద్వారా 1930 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు సుంకేసుల డ్యామ్ ఏఈ రాజు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు.

Next Story