- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీభవన్‌లో నేడు ‘మంత్రులతో ముఖాముఖి’.. హాజరుకానున్న తుమ్మల
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సూచన మేరకు గాంధీభవన్ (Gandhi Bhavan) వేదికగా ప్రతి బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సూచన మేరకు గాంధీభవన్ (Gandhi Bhavan) వేదికగా ప్రతి బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఆయనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తాకు కూడా హాజరుకానున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో సాధారణ ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు తమ సమస్యలను వినతి పత్రాల మంత్రి తుమ్మలకు అందజేస్తారు. ప్రజల సమస్యలను నేరుగా వినడం, పరిష్కరించేందుకు గాను రేవంత్ సర్కార్ ‘ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు’ అనే కాన్సెప్ట్‌తో ఈ కార్యక్రమానిక శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.






