- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు అధిక ఆదాయం వచ్చే నూనెపంటల వైపు మొగ్గు చూపాలి: మంత్రి తుమ్మల
రైతులు అధిక ఆదాయం వచ్చే నూనె గింజలు, ఆయిల్ పామ్ ,ఉద్యానవన పంటల వైపు మొగ్గుచూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల్య ఎరువుల వాడకం అలవర్చుకోవాలని ఆయిల్ పామ్ లో అంతర పంటలు వేసి తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం పొందే విధంగా వ్యవసాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు అధిక ఆదాయం వచ్చే నూనె గింజలు, ఆయిల్ పామ్ ,ఉద్యానవన పంటల వైపు మొగ్గుచూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల్య ఎరువుల వాడకం అలవర్చుకోవాలని ఆయిల్ పామ్ లో అంతర పంటలు వేసి తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం పొందే విధంగా వ్యవసాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో నేషనల్మిషన్ఆన్ఈడిబుల్ఆయిల్, ఆయిల్సీడ్స్పథకం ద్వారా రైతుకు వంద శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి వివిధ జిల్లాల రైతులతో నూనె పంటల సాగులో వారి అనుభవాలను పంచుకొన్నారు. జాతీయ నూనే గింజల పథకాన్ని 2025-26 సంవత్సరంలో రూ. 66.67 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించుచున్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగా ఈ యాసంగి సీజనులో 45,350 ఎకరాల్లో 38434 క్వింటాళ్ళ వేరుశనగ విత్తనాలు రూ. 46.14 కోట్లతో మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతునేస్తంలో భాగంగా విత్తన పంపిణీ తర్వాత సీసీఐ తయారుచేసిన కపాస్కిసాన్యాప్గురించి రైతులకు వివరించారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలుకు తీసుకున్న చర్యలను వివరించారు. అదే విధంగా పశుసంవర్ధక శాఖ పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నివారణ ,వ్యాక్సినేషన్ చర్యలను తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం తరువాత సచివాలయంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన పదిమంది రైతులకు విత్తనాలు అందచేసి, వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ , వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి , అమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత , రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ,తలకొండపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.






