బ్రేకింగ్: తుమ్మలతో పొంగులేటి భేటీ.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి

by Satheesh |
బ్రేకింగ్: తుమ్మలతో పొంగులేటి భేటీ.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ జిల్లా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పార్టీ మార్పుతో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీగా డ్యామేజ్ జరగగా.. టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల సైతం బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగానే, ఇవాళ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రావు తుమ్మల ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు వచ్చిన పొంగులేటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన స్వార్ధం, నా కుటుంబం కోసం నేనే పని చేయనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాను ఎక్కువగా అభివృద్ధి చేశానని తెలిపారు. ఇక, పార్టీ మార్పు అనుచరులు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని తుమ్మల తేల్చి చెప్పారు.

Advertisement

Next Story