- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Candidate: టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నర్సిరెడ్డి, అశోక్ కుమార్
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు, ఒక పట్టభద్రుల స్థానానికి జరగబోయే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ ,అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థులను (Teacher MLC Candidates) బుధవారం ప్రకటించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గానికి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ (Y.Ashok Kumar) ను వరగంల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (Alugubelli, Narsireddy) ని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ జరిగిన అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో ఈ వివరాలను తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫడరేషన్ (TSUTF) సభ్యులు వెల్లడించారు.






