- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు TSRTC మరో గుడ్ న్యూస్
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వరుస సెలవుల నేపథ్యంలో ఇవాళ, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వరుస సెలవుల నేపథ్యంలో ఇవాళ, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్డీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోందని తెలిపారు. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
- Tags
- tsrtc
Next Story






