TSPSC : సిట్ విచారణలో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు

by Disha Web Desk 4 |
TSPSC : సిట్ విచారణలో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 6 పరీక్షలకు చెందిన 15 పేపర్లు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్ - 1 పేపర్ ఐదుగురికి లీక్ అయినట్లు గుర్తించారు. ఏఈ పేపర్ ఎక్కువ మందికి లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా పేపర్లు పెన్ డ్రైవ్ లోనే ఉన్నాయని సిట్ అధికారులు తెలిపారు. గ్రూప్ -1 మెయిన్స్ పేపర్ లీక్ చేసేందుకు కూడా నిందితులు రాజశేఖర్, ప్రవీణ్ ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లలో గ్రూప్ -1, ఏఈ, ఏఈఈ, జేఎల్, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ అకౌంట్స్ పేపర్లు లభ్యమయ్యాయి.

Next Story

Most Viewed