TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారు

by Disha Web Desk 2 |
TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను టీఎస్ పీఎస్సీ ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ టెస్ట్) , జూన్ 6న పేపర్ -1 జనరల్ ఎస్సే, జూన్ 7న పేపర్ 2, హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, జూన్ 8న పేపర్ 3, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, జూన్ 9న పేపర్-4 ఎకానమీ అండ్ డెవలప్ మెంట్, జూన్ 10న పేపర్- 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రెటేషన్, జూన్ 12న పేపర్-6 తెలంగాణ మూవ్ మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్లకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.

పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయని తెలిపింది. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లీషు మినహా పేపర్లకు అభ్యర్థులు ఎంచుకున్నట్లు ఇంగ్లీష్, తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు పేపర్‌లో కొంత భాగాన్ని ఇంగ్లీషులో కొంత భాగాన్ని తెలుగు లేదా ఉర్దూలో రాయడానికి అనుమతిలేదని స్పష్టం చేశారు. మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా రాత పరీక్షలోని అన్ని పేపర్లకు హాజరు కావాలి. ఏదైనా పేపర్‌ పరీక్ష రాయకపోతే ఆ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Next Story