- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షల తేదీలను మార్చుతూ శనివారం బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23 న జరగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షను జూన్ 28 కు మార్చారు. అలాగే ఈ నెల 25వ తేదీన జరిగే అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష మే 16న నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. ఈ నెల 26, 27 తేదీల్లో జరగాల్సిన భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల ఎగ్జామ్ జూలై 18, 19న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అలాగే మే 7 జరగాల్సిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష మే19న నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 15, 16 వ తేదీల్లో జరగాల్సిన భూగర్భ జల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షలు జూలై 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.






